ETV Bharat / city

తెలంగాణ: టీకా కోసం గంటల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు - వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ

టీకా కోసం వచ్చే ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల కొద్ది వేచి చూసిన వ్యాక్సిన్ తీసుకోవడం కత్తిమీద సాములా మారింది. తెలంగాణ వ్యాప్తంగా రెండో డోసు టీకా కార్యక్రమం ప్రారంభం కాగా... తెల్లవారుజామునుంచే ప్రజలు బారులు తీరారు. చాలా చోట్ల కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసి పోగా భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్​తో పాటు అన్నీ చోట్ల దాదాపు అదే పరిస్థితి కనిపించింది.

covid second dose in telangana
covid second dose in telangana
author img

By

Published : May 8, 2021, 7:30 PM IST

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి రెండో డోసు వేసుకునే వారికి మాత్రమే కోవిడ్‌ టీకాలు అందిస్తామన్న.. అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. టీకా కోసం కేంద్రాలన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. వ్యాక్సిన్‌ కోసం అందరూ ఒకేసారి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జనం విజ్ఞప్తి చేశారు.

ఈనెల 15 వరకు పంపిణీ:

కరోనా కట్టడికి ఇస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ….. రెండో డోసు వేసుకునే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 11 లక్షల మంది వరకు రెండో డోసు తీసుకోవాల్సిన వారున్నారని పేర్కొన్న వైద్యారోగ్య శాఖ శనివారం నుంచి ఈనెల 15 వరకు టీకా పంపిణి చేయాలని నిర్ణయించింది. అప్పటివరకు మొదటి డోసు పంపిణీ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ సూచనలతో టీకా వేసుకునేందుకు పంపిణి కేంద్రాలకు ఉదయం నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే బారులు

హైదరాబాద్‌లోని వ్యాక్సిన్ కేంద్రాలన్ని...... జనంతో కిక్కిరిసిపోయాయి. మలక్‌పేట, సరూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కోవిడ్ వ్యాక్సిన్ కోసం జనం బారులు తీరారు. పెద్దఎత్తున ప్రజలు రావడంతో కేవలం 100 మందికే టోకెన్లు ఇచ్చారు. కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ పీహెచ్​సీ వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా జనం ఎగబడటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రి వద్దకు తెల్లవారుజామునే స్థానికులు తరలివచ్చారు. గంటల తరబడి వేచిచూసినా వ్యాక్సిన్ ఇవ్వలేదని ఆరోపించారు. అధికారుల కాలాయాపన వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలోని ఆరోగ్య కేంద్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది.

ఓరుగల్లులో అదే పరిస్థితి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు వరుస కట్టారు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలో టీకా దొరకదన్న ఆందోళనతో ఎక్కువమంది రాగా... కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. హన్మకొండ లస్కర్ సింగారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిక్కిరిసి పోయింది. నిబంధనలు పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌లో అధికారులు తొలిరోజు రెండో డోసు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఆయా చోట్ల రద్దీ పెరిగింది. ఎక్కడా భౌతిక నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా కేంద్రంతో జగన్ స్నేహం: జేఎంఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.