తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలు, వాగులు, చెరువులు నిండుకుండలుగా మారాయి. ప్రధానంగా కొత్తగూడ అడవి ప్రాంతంలో భారీ వర్షాలకు బొగ్గులవాగు పొంగిపొర్లుతోంది.
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సుకు వరద నీరు భారీగా చేరుకుని మత్తడి పోస్తోంది. ప్రస్తుతం ఈ సరస్సులో నీటిమట్టం 33.5 అడుగుల నీరు చేరడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు వెంకటాపురంలోని రామప్ప చెరువులో నీటి మట్టం పెరిగి ప్రస్తుతం 29 అడుగులకు చేరుకుంది. ఏటూరునాగారం మండలంలోని జంపన్న వాగు, దెయ్యాలవాగు పొంగిపొర్లుతున్నాయి.
ఇదీ చూడండి : నేడు తేలికపాటి వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వర్షం