ETV Bharat / city

ఆర్థిక సంఘం నిధులు పీడీ ఖాతాలోకి.. విలవిల్లాడుతున్న గ్రామ పంచాయతీలు - ఏపీ పంచాయతీలు

AP Panchayaths: గ్రామ పంచాయతీలు ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోయాయి. పంచాయతీల పీడీ ఖాతాల ఉక్కు సంకెళ్లలో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఊళ్లో చిన్న సమస్య పరిష్కరించాలన్నా, రూపాయి ఖర్చు చేయలన్నా... చేతిలో చిల్లిగవ్వ లేక పాలకవర్గాలు నేలచూపులు చూస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు పంచాయతీల ఖాతాల్లో వేస్తున్నట్లు పుస్తకాల్లో నమోదు చేస్తున్నా... సొమ్ములు మాత్రం రాష్ట్ర సర్కారు ఆధీనంలోనే ఉంటున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి విచక్షణ మేరకు సీఎఫ్​ఎంఎస్​ ద్వారా బిల్లులు మంజూరు చేస్తేనే డబ్బులు... లేదంటే అంతే సంగతులు.

AP Panchayaths
పంచాయతీల పరిస్థితి
author img

By

Published : Sep 11, 2022, 12:18 PM IST

Updated : Sep 11, 2022, 12:36 PM IST

AP Panchayaths: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థికసంఘం నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం 2020-21 నుంచి అమల్లో ఉంది. ఇప్పటికే రెండేళ్లకు 3వేల 500 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ఇందులో 70శాతం నిధులు తలో 15శాతం చొప్పున గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్తులకు కేంద్రం కేటాయించింది. ఈ నిధులను గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణకు వెచ్చించొచ్చు. ఉపాధి హామీ పథకంలోనూ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో గ్రామాల్లో కొత్తగా రోడ్లు, కాలువల పనులు చేపట్టొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్టాంపు డ్యూటీ, మైనింగ్‌ సెస్, వృత్తి, వినోద పన్ను, తలసరి గ్రాంట్‌ను అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం ఉంటుంది. అయితే తనవంతు నిధులను అరకొరగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులనూ పీడీ ఖాతాల్లో వేస్తోంది.

ప్రతి గ్రామ పంచాయతీకి ఒకప్పుడు బ్యాంకు ఖాతాలు ఉండేవి. ఆ ఖాతాల్లోకి నిధులు రాగానే.... పాలకవర్గం తీర్మానంతో స్వతంత్రంగా ఖర్చు చేసేవారు. కొంతకాలంగా ఆర్థిక సంఘం నిధులు, నరేగా సొమ్ములతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ నిధులనూ పీడీ ఖాతాల్లో వేస్తున్నారు. ఈ డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు లేదు. పంచాయతీ తరఫున పని చేయించి రాష్ట్ర ఆర్థికశాఖ పర్యవేక్షణలోని సీఎఫ్​ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే... అక్కడ పరిశీలించాక బిల్లులు చెల్లిస్తారు. ఎప్పుడు చెల్లిస్తారనేదీ ఆర్థికశాఖ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల పంచాయతీ పీడీ ఖాతాలో సొమ్ములున్నా... నేరుగా వాడుకోలేని దుస్థితి. ఈ పరిస్థితిపై సర్పంచులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.

పంచాయతీల పరిస్థితి

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు జమయ్యేలా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచినా... ఇప్పటికీ రూపాయి సర్దుబాటు కాలేదు. 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి దాదాపు రూ.1244 కోట్లు గ్రామ పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిల కింద పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. 15వ ఆర్థిక సంఘం నుంచి 2021-22 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇటీవల విడుదల చేసిన 379 కోట్లు పీడీ ఖాతాకు సర్దుబాటు చేసింది. వీటిని కూడా విద్యుత్ ఛార్జీల బకాయిల కింద మరోసారి మళ్లించేలా చర్యలు తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నుంచి తాజాగా విడుదలైన మరో రూ. 569 కోట్లనూ పీడీ ఖాతాలకు సర్దుబాటు చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంఘం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చి, ఈ విధంగా మాట తప్పడం సరికాదని సర్పంచులు అంటున్నారు.

రాష్ట్రంలోని వివిధ పంచాయతీల్లో ఆర్థిక సంఘం నిధులతో దాదాపు 250 కోట్ల విలువైన పనులు పూర్తిచేయించిన సర్పంచులు.. గత మూడు, నాలుగు నెలలుగా బిల్లులు అప్‌లోడ్‌ చేయలేదు. పంచాయతీల పేరుతో ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచినందున బిల్లులకు ఇబ్బంది ఉండదని భావించి అత్యధిక పంచాయతీల్లో పనులు చేపట్టారు. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులు పంచాయతీ ఖాతాలకు కాకుండా... CFMS ఆధ్వర్యంలోని పీడీ ఖాతాలకు జమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో సర్పంచులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

5వ ఆర్థిక సంఘంతోపాటు సాధారణ నిధులున్న పంచాయతీల్లోనూ చాలాచోట్ల సర్పంచులు పనులు చేయడం లేదు. పనులు పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్‌ చేశాక ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితుల్లో... పనులు చేయకపోవడమే మేలని భావిస్తున్నారు. దీంతో పలు పంచాయతీల్లో దాదాపు 800 కోట్ల నిధులు ఖాతాలకే పరిమితమయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : Sep 11, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.