Kurnool Pigeon in Paleru : తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో.. నునావత్ నాగమణి అనే మహిళ బియ్యపు గింజలు చల్లగా ఓ పావురం కింద వాలింది. ఆమె కుమారుడు నవీన్ దానిని పట్టుకున్నాడు. దాని కాలికి ఉన్న ట్యాగ్‌పై కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి పేరు, ఫోన్ నంబరు రాసి ఉన్నాయి. ఆ నంబరులో సంప్రదించగా.. పావురాల పోటీల గురించి వివరించారు.
Suspicious Pigeon : తాను 250 కిలోమీటర్ల దూరం పందెంలో పాల్గొని ఆదివారం కారులో పావురాన్ని కర్నూలు నుంచి మెదక్ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేసి వచ్చినట్లు వెల్లడించారు. అది తిరుగు ప్రయాణంలో ఉందని వివరించారు. అలసిపోతే లేక ఏదైనా గాయమైతేనే పావురాలు కిందికి దిగుతాయని చెప్పారు. అయితే చైనా భాష ఉన్న అక్షరాలు పోటీలో కోడ్ నంబరు మాత్రమేనని ఆయన చెబుతున్నారు. వాటి గురించి కంగారు పడాల్సిన పని లేదన్నారు. చెన్నై కేంద్రంగా ఒక సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం మరోసారి ఫోన్‌లో మాట్లాడడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
సంబంధిత కథనాలు :