ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు సిద్దమన్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. నేడు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్దకు రావాలని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. మంత్రికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేయడం లేదు..? అసలు ఖాళీలెన్ని.. వంటి తదితర అంశాలపై చర్చించడానికి నేడు మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్ వద్ద మంత్రి కోసం ఎదురు చూస్తామని శ్రవణ్ తెలిపారు. శాంతియుత చర్చల ద్వారా.. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పరీక్షలో అక్రమాలు.. స్క్రీన్షాట్లతో జవాబులు