ETV Bharat / city

Water boards: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నేటినుంచే కీలక సమావేశాలు.. ఏం జరగనుంది? - కేఆర్ఎంబీ

తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నేటినుంచి కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. ఉపసంఘాలతో మొదలై పూర్తిస్థాయి బోర్డుల ప్రత్యేక సమావేశాల వరకూ జరగనున్నాయి. అయితే.. రెండు రాష్ట్రాలూ పలు ప్రాజెక్టుల విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది.

Water boards
Water boards
author img

By

Published : Oct 10, 2021, 7:04 AM IST

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు త్వరలోనే నదీ యాజమాన్య బోర్డుల చేతిలోకి వెళ్లనున్నాయి. రెండు బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి అది అమల్లోకి రావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం, వివరాల ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టేందుకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సిద్దమవుతున్నాయి. శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌, ముచ్చుమర్రి, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ఔట్ లెట్లు, నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాల్వలు, ఆర్డీఎస్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేపట్టే అవకాశం ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు బోర్డు నిర్వహణలోకి వెళ్లనుంది.

ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రెండు బోర్డుల ఉపసంఘాలు ఇవాళ హైదరాబాద్ జలసౌధలో సమావేశం కానున్నాయి. పూర్తి స్థాయి గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశం రేపు, కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మంగళవారం జరగనుంది. ప్రాజెక్టుల నిర్వహణ విషయమై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రాల నుంచి ఇంకా రావాల్సిన సమాచారం, వివరాలపై కూడా ఆరా తీస్తారు. నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలు రెండు బోర్డులకు 200 కోట్ల రూపాయాలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై కూడా చర్చ జరగనుంది. కొంత మొత్తాన్ని బోర్డులకు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో..

* శ్రీశైలం స్పిల్‌వే

* కుడి విద్యుత్తు కేంద్రం

* పోతిరెడ్డిపాడు

* హంద్రీనీవా ఎత్తిపోతలకు నీటిని తీసుకొనే పంపుహౌస్‌

* ముచ్చుమర్రి పంపుహౌస్‌

తెలంగాణలో..

* ఎడమ విద్యుత్తు కేంద్రం

* కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌

* నాగార్జునసాగర్‌ కింద అత్యధికంగా 15 పాయింట్లున్నాయి. హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువలతోపాటు, ప్రధాన విద్యుత్తు హౌస్‌, ఎడమ కాలువ కింద అనేక పాయింట్లు ఉన్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్‌.పి) లిప్టును కూడా మొదటి దశలో చేర్చారు.

* నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌

* పులిచింతల కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌

* కేసీకాలువ కింద సుంకేశుల బీ ఆర్డీఎస్‌ కింద క్రాస్‌ రెగ్యులేటర్‌

* తుమ్మిళ్ల ఎత్తిపోతల

అభ్యంతరాలున్నవి ఇవే..
నిర్వహణలో ఉన్న, ఇంకా నిర్వహణలోకి రాని పలు ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి అవసరం లేదని రెండు రాష్ట్రాలు పేర్కొన్నట్లు ఉపసంఘం నివేదిక వెల్లడించింది. ఇందులో జూరాల, నెట్టెంపాడు, భీమాతో సహా దేన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంది. వీటితో పాటు ఎస్‌.ఎల్‌.బి.సి, పాలమూరు-రంగారెడ్డి, డిండి, హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, భక్తరామదాసు, పాలేరు రిజర్వాయర్‌, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తీసుకునే ఆరు పాయింట్లపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయాలని కోరుతున్న తెలంగాణ.. శ్రీశైలం ఎడమ విద్యుత్తు కేంద్రం, నాగార్జునసాగర్‌ హెడ్‌వర్క్స్‌, ప్రధాన విద్యుత్తు కేంద్రానికి అంగీకరించే అవకాశం తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

* బనకచెర్ల రెగ్యులేటర్‌, నిప్పులవాగు, ఎస్సార్బీసీ-అవుకు, వెలిగోడు, తెలుగుగంగ లింకు కాలువ, వెలిగొండ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. గాలేరు-నగరి, తుంగభద్ర ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, మునియేరు నీటిమళ్లింపు, గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని మళ్లించే పథకం, కృష్ణాడెల్టా, గుంటూరు ఛానల్‌ అవసరం లేదని ఏపీ తెలిపిందని ముసాయిదా నివేదికలో ఉపసంఘం పేర్కొంది.

ఇదీ చూడండి:ఇళ్ల నిర్మాణంపై డివిజన్ బెంచ్​లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.