కృష్ణా ట్రైబ్యునల్ అంశంపై దాఖలైన పిటిషన్లపై.. డిసెంబర్ 13 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ట్రైబ్యునల్ ఉత్తర్వులు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల వంటి అంశాలపై దాఖలైన వ్యాజ్యాలను.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఈ నేపథ్యంలో.. కృష్ణా ట్రైబ్యునల్ అంశంపై వాదనలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం 4 రాష్ట్రాలను ఆదేశించింది. 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణకు 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: