ETV Bharat / city

'మిగులు జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్​కు వెళ్లవచ్చు'

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాశారు. ఏడాది కేటాయింపుల్లో మిగులు జలాలను తదుపరి ఏడాది వినియోగించుకునే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్​కు వెళ్లవచ్చని లేఖలో పేర్కొన్నారు.

krishna-river-
krishna-river-
author img

By

Published : Nov 4, 2020, 9:19 PM IST

ఒక ఏడాది కేటాయింపుల్లో మిగులు జలాలను తదుపరి ఏడాది వినియోగించుకునే అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్​కు వెళ్లవచ్చని కేంద్రజలసంఘం సూచించింది. కేటాయింపుల్లో మిగులు జలాలను తదుపరి ఏడాది వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణ రాష్ట్రం గతంలోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది.

మిగులు జలాలు కూడా ఉమ్మడి జలాశయాల్లోనే నిల్వ చేస్తున్నందున అందులో తమకూ వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ విషయాన్ని బోర్డు సీడబ్ల్యూసీకి నివేదించింది. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన నేపథ్యంలో... బోర్డు సూచనల మేరకు లేదా రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకరిస్తే తప్పా... సమస్యను పరిష్కరించలేమని కేంద్ర జలసంఘం అభిప్రాయపడింది. దీంతో సమస్య శాశ్వత పరిష్కారం కోసం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్​ను ఆశ్రయించవచ్చని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి లేఖ రాశారు.

ఇదీ చూడండి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం కౌంటర్‌ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.