ETV Bharat / city

KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి' - Andhra Pradesh Latest News

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్​ నోటిఫికేషన్(Gazette Notifications for KRMB and GRMB)​ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరగా ఇవ్వాలని ఈ రెండు బోర్డులు తెలుగు రాష్ట్రాలను(TELUGU STATES) కోరాయి. వాటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాయి.

KRMB and GRMB
'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'
author img

By

Published : Oct 1, 2021, 9:06 AM IST

గెజిట్‌ నోటిఫికేషన్‌(Gazette Notifications for KRMB and GRMB) అక్టోబరు 14 నుంచి అమలులోకి రానున్నందున నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరగా ఇవ్వాలని కృష్ణా, గోదావరి బోర్డులు(KRMB and GRMB) రెండు రాష్ట్రాలను కోరాయి. బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌(Gazette Notifications for KRMB and GRMB) అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేసేందుకు రెండు బోర్డులు రెండు ఉపసంఘాలను నియమించాయి. ఇవి ఇచ్చే నివేదిక ఆధారంగా బోర్డులు చర్య తీసుకోనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన కసరత్తును పరిగణనలోకి తీసుకొంటే గెజిట్‌(Gazette Notifications for KRMB and GRMB) నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. గురువారం తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన బోర్డుల ఉపసంఘాల సమావేశంలో గోదావరి బోర్డు కార్యదర్శి పాండే, కృష్ణా బోర్డు ఉపసంఘం సమన్వయ కర్త రవికుమార్‌ పిళ్లై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ రాష్ట్ర జలవనరులు, జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్లు మోహన్‌కుమార్‌, బిచ్చన్న, శ్రీనివాసరెడ్డి, సుజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ప్రాజెక్టుల వద్ద ఆచరణాత్మకంగా ఎంత మంది సిబ్బంది అవసరమో ఇవ్వడంతో పాటు కార్యాలయాల్లోని ఫర్నిచర్‌, వాహనాలు, యంత్రాలు ఇలా మొత్తం వివరాలు ఇవ్వాలని బోర్డులు కోరాయి.

పూర్తి వివరాలిచ్చిన ఏపీ.. ఉమ్మడి ప్రాజెక్టులవే ఇస్తామన్న తెలంగాణ

ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలే తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాసినందున అంతవరకే ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనగా, మొదట పూర్తి సమాచారం ఇవ్వాలని, కేంద్రం నిర్ణయం తీసుకొంటే అప్పుడు అంతవరకే పరిమితం అవుతామని బోర్డులు చెప్పాయి. దీంతో పూర్తి సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఐఎస్‌ఎఫ్‌ కార్యాలయాలు, నివాసాలకు సంబంధించి కూడా కొన్ని వివరాలిచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్వహణకు టెండర్లు పిలిచి పనులు ఏమైనా జరుగుతున్నాయా? భవిష్యత్తులో ఈ పనులు ఎలా చేపట్టాలో కూడా తెలపాలని రెండు రాష్ట్రాల ప్రతినిధులను బోర్డులు కోరాయి. ఇప్పటివరకు తెలంగాణ నుంచి కొంత సమాచారం మాత్రమే రాగా, వచ్చే సోమవారం లోగా పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని బోర్డులు కోరాయి. అయితే ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలు మాత్రమే ఇస్తామని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక మిగతావి ఇస్తామని తెలంగాణ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. బడ్జెట్‌ ఇతర అంశాలపై కూడా చర్చ జరిగింది. తుంగభద్ర బోర్డు అనుసరించే పద్ధతిపై కూడా మాట్లాడినట్లు తెలిసింది. వచ్చే వారం ఉపసంఘాలు బోర్డులకు ఓ నివేదిక అందజేసే అవకాశం ఉంది. దీనిని బట్టి రెండో షెడ్యూలులోని అన్ని ప్రాజెక్టులు అక్టోబరు 14 నుంచి బోర్డుల పరిధిలోకి వస్తాయా లేదా అన్నది తేలనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.