ETV Bharat / city

రాష్ట్రానికి పెట్టుబడులతో రండి...అభివృద్ధికి సహకరించండి

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు రావాలని క్షిణ కొరియా ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు, మౌలిక వసతుల కల్పన, ఆక్వా రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని కొరియా ప్రతినిధి బృందానికి మంత్రులు, అధికారులు వివరించారు.

రాష్ట్రానికి పెట్టుబడులతో రండి...అభివృద్ధికి సహకరించండి
author img

By

Published : Sep 21, 2019, 5:58 AM IST

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు రావాలని తనను కలిసిన దక్షిణ కొరియా ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని కోరారు. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని కొరియా ప్రతినిధి బృందానికి సీఎంతో పాటు మంత్రులు, అధికారులు వివరించారు

ఉక్క కర్మాగారానికి సహకరించండి...

దక్షిణకొరియాలోని బూసాన్‌లో గౌరవ కాన్సుల్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్న జంగ్‌ డియోక్‌ మిన్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం జగన్‌ను కలిసింది. కడప ఉక్కు కర్మాగారం పై వారితో చర్చించిన సీఎం... ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక సముదాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి పెట్టుబుడులు వచ్చేలా కొరియన్‌ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. సముద్ర ఉత్పత్తులు, మామిడి ఉత్పత్తుల ఎగుమతుల్లో నాణ్యత ఉండేలా తగిన సాంకేతికత అందించడానికి ఒక ప్రతినిధిని ఇక్కడ ఉంచాలన కోరారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు పారిశ్రామిక సముదాయాలు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు కొరియన్‌ ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్రానికి పెట్టుబడులతో రండి...అభివృద్ధికి సహకరించండి

ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి...

రాష్ట్రంలో నదులపై ఎత్తైన వంతెనలు నిర్మించి, అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా కాన్సులేట్, ప్రతినిధుల బృందం ఆసక్తి ప్రదర్శించింది. పరిశ్రమలు, శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో దక్షిణ కొరియా కాన్సులేట్ , ప్రతినిధుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను మంత్రి సుదీర్ఘంగా కొరియా ప్రతినిధులకు వివరించారు. మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటుందో తెలిపారు.రాష్ట్రంలో ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో సాంకేతిక శిక్షణకు సహకారం అందించేందుకు దక్షిణకొరియా ముందుకు వచ్చిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కొరియన్‌ ప్రతినిధులతో సమావేశమనంతరం తెలిపారు.

సాగు రంగాల్లో తోడ్పాటు....

ఆటోమొబైల్, ఆహారశుద్ధి, రొయ్యలసాగు, మామిడిపండ్లు, మిర్చిసాగు రంగాల్లో తోడ్పాటు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొరియా ప్రతినిధి బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి, మౌళిక సదుపాయాల రంగాల్లో కలిసి పనిచేసేందుకు కొరియన్ సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి-వైఎస్సార్ కంటి వెలుగు పథకం... దశలవారీగా ఉచిత కంటి పరీక్షలు

Intro:యాంకర్ సూక్ష్మ ఆకృతుల తయారీలో ఇప్పటికే పేరు తెచ్చుకున్న స్వర్ణకారుడు మరో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు తాజాగా ఈఫిల్ టవర్ వెండితో తయారు చేయడంతోపాటు తాజ్ మహల్ సైకిల్ వంటివి తయారు చేసి ఇ ఆకట్టుకుంటున్నాడు దీనికితోడు వినాయక వినాయక చవితి నేపద్యంలో కంకర రాయి పై గణపతి ఆకృతిని తయారుచేసి అబ్బురం అనిపించాడు. వాయిస్ ఓవర్ విశాఖ జిల్లా రోలుగుంట గ్రామానికి చెందిన వై దాసు శ్రీనివాసరావు అనే స్వర్ణకారుడు కొద్దిరోజులుగా సూక్ష్మక్రిముల తయారీపై దృష్టి సారించాడు దీనిలో భాగంగానే ఇప్పటికే వెండి బంగారం వంటి లోహాలతో అనేక కృతులకు జీవం పోసాడు తాజాగా 7:30 సెంటీమీటర్ల పరిమాణంలో ఎనిమిది గ్రాములు ఎన్ని వెండితో ఈఫిల్ టవర్ ను రూపొందించారు తాజ్ మహల్ సైకిల్ వంటివి తక్కువ పరిమాణంలో ని తయారు చేసాడు ఈ వినాయకచవితి నేపథ్యంలో కంకర రాయి పై గణపతి ఆకృతిని తయారుచేసి ఔరా అనిపించాడు అలాగే సెల్ ఫోన్ బ్యాటరీ ద్వారా సూక్ష్మ మోటారును తయారుచేశాడు ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ప్రపంచంలో ఏడు వింతలను వెండి బంగారం లోహాలతో తయారు చేయడమే తన లక్ష్యమని స్వర్ణకారుడు శ్రీనివాసరావు చెబుతున్నాడు బైట్ వై దాసు శ్రీనివాసరావు స్వర్ణకార కారుడు రోలుగుంట

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.