తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా వెంకటపూర్ సమీపంలో కొండపోచమ్మ జలాశయ పంట కాల్వకు గండి పడింది. కాల్వకు గండిపడటం వల్ల నీరంతా గ్రామంలోకి చేరుతుంది. దీనితో అక్కడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి పడింది. దీనితో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంట పొలాలు, కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి.
తెలంగాణ: కొండపోచమ్మ జలాశయ పంట కాల్వకు గండి - Kondapochamma Reservoir Canal break news
.
![తెలంగాణ: కొండపోచమ్మ జలాశయ పంట కాల్వకు గండి kondapochamma-reservoir-crop-canal-break-in-siddipet-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7827121-751-7827121-1593488809760.jpg?imwidth=3840)