కొత్త జిల్లాల ఏర్పాటుతో అసెంబ్లీ ఉపసభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంబరపడిపోయారు. తమ నియోజకవర్గ కేంద్రాలే జిల్లా కేంద్రాలుగా ఏర్పాటవుతున్నాయనే సంతోషంలో మునిగిపోయారు. చివరికి వారికి ఆ ఆనందమే మిగిలింది. జిల్లా కేంద్రంతోనే సరిపుచ్చుకోండి అని ప్రభుత్వం వారికి చెప్పకనే చెప్పింది. వారి స్థానంలో ఉపసభాపతిగా కోలగట్ల వీరభద్రస్వామికి, చీఫ్‌విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కొడాలికి 'అభివృద్ధి' అప్పగింత!: ప్రతిపక్షనేతపై ఒంటికాలిపై విరుచుకుపడినా... అసభ్యపదజాలం వాడుతూ గొంతు చించుకున్నా.. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)కు మాత్రం మంత్రి పదవి మళ్లీ దక్కలేదు. పాత మంత్రివర్గ సభ్యుల్లో 11 మందిని తిరిగి కొనసాగించినా నానికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో జోగి రమేశ్‌కు అవకాశమిచ్చారు. మరి నాని సంగతేమిటంటే.. అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ఛైర్మన్ పదవిని ఆయనకు ఇస్తారని చెబుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మల్లాది విష్ణుకు రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ఛైర్మన్ పదవిలో నియమిస్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: భగ్గుమన్న సుచరిత వర్గీయులు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!