ఓటు వివరాలు తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఆన్లైన్లో సౌకర్యం కల్పించింది. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ పద్ధతిలో ఓటు వివరాలు తెలుసుకునేందుకు www.nvsp.in వెబ్సైట్లో ఓటర్ల వివరాలు పొందుపర్చింది.
ఓటు వివరాలు ఇలా తెలుసుకోండి...
* నెట్లో ఈ సైట్ ఓపెన్ చేయగానే.. సెర్చ్ ఇన్ ఎలక్షన్ రోల్‌ను ఎంపిక చేసుకోవాలి.
* దీనిలో 'సెర్చ్ బై డిటైల్స్', లేదంటే 'సెర్చ్ బై ఎపిక్ నంబరు' అని రెండు విధాలుగా ఓటరు తమ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
* సెర్చ్ బై డిటైల్స్‌లో ఓటరు పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం పేరును నమోదు చేసి పరిశీలిస్తే పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. సెర్చ్ బై ఎపిక్ నంబరు ద్వారా ఓటరు ఐడీ నంబరు ఎంటర్ చేసి ఓటు వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.
ఓటరు హెల్ప్ యాప్ ద్వారా...
'ఓటర్ హెల్ప్‌లైన్ యాప్'ను డౌన్లోడ్ చేసుకుంటే లాగిన్ ఐడీ అవసరం లేకుండా వివరాలు పొందవచ్చు. యాప్‌లోకి వెళ్లగానే స్కిప్ లాగిన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనిలో సెర్చ్ బై డిటైల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబరు ద్వారా వివరాలు పొందవచ్చు. సెర్చ్ బై డిటైల్స్‌లో ఓటరు పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలను క్లిక్ చేసి పరిశీలిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) ఎంటర్ చేసి ఓటు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
ఇవీ చదవండి.. ఆ 30 మంది ఓటర్లకు ఇవే చివరి ఎన్నికలు!