ETV Bharat / city

సర్కారు బడుల్లో కిండర్​గార్డెన్​! - సర్కారు బడుల్లో కిండర్​గార్డెన్​!

సర్కారీ బడుల్లో వచ్చే ఏడాది నుంచి కే12 విద్యా విధానాన్ని అమలు చేయాలని బాలకృష్ణన్​ కమిటీ సూచించింది. దీనిపై మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది.

సర్కారు బడుల్లో కిండర్​గార్డెన్​!
author img

By

Published : Oct 29, 2019, 7:19 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించాలని విద్యాశాఖలో సంస్కరణల కమిటీ సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కే12 విద్యా విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలకృష్ణన్​ కమిటీ మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది. మంగళవారం ప్రభుత్వానికి ఈ నివేదికను అందజేయనుంది.

పాఠశాల విద్యలో సిఫార్సులు

  1. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కే12 ( కిండర్​ గార్డెన్​ నుంచి ఇంటర్​ వరకు) విద్యావిధానం.
  2. ఇంటర్మీడియట్​ను పాఠశాల విద్యలో విలీనం చేయాలి. ఇంటర్​ బోర్డును పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల విభాగంలో కలపాలి.
  3. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్య ( ఎల్​కేజీ, యూకేజీ) అమలు చేయాలి.
  4. అంగన్​వాడీలతో కలిసి 10వేల పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలను సిద్ధం చేయాలి.
  5. ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో 50 శాతం నేరుగా, మరో 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.
  6. జిల్లా నుంచి కమిషనరేట్​కు ఒకే లైన్​ విధానం ఉండాలి. ఇప్పటికే దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లా విద్యాధికారుల (డీఈవో) పోస్టులను సంయుక్త సంచాలకులు (జేడీ)గా మార్చనున్నారు.
  7. చాలామంది ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. వారికి మెరుగైన శిక్షణ అందించాలి. ఉపాధ్యాయ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
  8. డిజిటల్​ సాంకేతికతపై ఎక్కువ మొత్తంలో వెచ్చించాలి.
  9. 29 శాతం పాఠశాలల్లో 49 మందిలోపు పిల్లలు ఉన్నారు.
  10. మొత్తం విద్యార్థుల్లో 43 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారు.

ఉన్నత విద్యలో సిఫార్సులు

  • విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ
  • కొత్తగా ఏర్పాటు చేసిన వర్సిటీల బలోపేతం
  • పరిశోధన, సృజనాత్మకత విభాగం ఏర్పాటు
  • కళాశాలలు, వర్సిటీలకు అక్రిడిటేషన్​ బోర్డు ఏర్పాటు

Intro:Body:

schools

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.