కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ, 11వ తరగతులలో ప్రవేశాలకు, 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీలను పొడిగించారు. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని తొలుత నిర్ణయించినప్పటికీ కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణింపబడతాయని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తు https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
ఇదీ చదవండి: MEGA TEXTILE PARK: తాడేపల్లిలో మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి