'ప్రజలు, పార్టీ అండగా ఉంది..భయమెందుకు!' - kesineni nani latest comments
పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని వదులుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదని.... ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీమోహన్‌ది తెలుగుదేశం డీఎన్ఏ అన్న ఆయన.... పార్టీని వీడేందుకు ఆయనా సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు. వంశీ తరపున పోరాడటానికి తామంతా అండగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదని వంశీకి సూచించారు.