ETV Bharat / city

KARTHIKA MASAM SPECIAL: కార్తిక మాసోత్సవాలు.. వేకువజాము నుంచే కిటకిటలాడుతున్న ఆలయాలు

author img

By

Published : Nov 5, 2021, 7:43 AM IST

Updated : Nov 5, 2021, 11:37 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కార్తీకమాసం సందర్భంగా కిటకిటలాడుతున్నాయి. ఈరోజే మొదటి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం నదులు, కాలువల్లో దీపాలను వదులుతున్నారు.

karthika-masam-special-pujas-conducted-devotees-in-ap
వేకువజాము నుంచే కిటకిటలాడుతున్న ఆలయాలు..

కార్తీకమాసం ప్రారంభమైన మొదటి రోజే రాష్ట్రంలో ఉన్న నదీ తీరాలు.. ఆలయాలు భక్తలుతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం నదీతీరాల వద్ద పూజలు చేసి దీపాలను నదుల్లో వదులుతున్నారు. శ్రీశైలంలో నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపారాధనలు చేస్తున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి ప్రదోషకాలంలో ఆకాశదీపం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కార్తీక పారాయణం, సహస్ర లింగార్చన, ప్రత్యేక లింగార్చనలు ఉంటాయని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం సుబ్బా రాయుడి కాలువ వద్ద, తణుకులోని గోస్తని కాలువ వద్ద మహిళలు పెద్ద ఎత్తున కార్తీక పూజలు నిర్వహించి అరటి దొప్పలలో చేసిన దీపాలను కాలువల్లో వదిలారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వేకువజాము నుంచే భక్తులు శివాలయాలను దర్శించుకుని పూజలు చేశారు. పరమశివుడికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అమలాపురంతో సహా కోనసీమ వ్యాప్తంగా కొలువైన శివాలయాల్లో శివ భక్తజనం కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు

ప్రకాశంజిల్లా చీరాల,పేరాల, వేటపాలెం, చిన్నగంజాం ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తులతొ కిటకిటలాడుతున్నాయి. పేరాలలోని పురాతనమ్తెన పునుగురామలింగేశ్వర స్వామి దేవాలయం, చీరాలలోని అతిపురాతన గంగాసమేత భ్రమరాంబికమల్లీశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే శివదర్శనం కొసం భక్తులు బారులు తీరారు. మహిళలు శివయ్యకు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీకదీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న దేవాలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి

కార్తీక మాసంలో శివకేశవులిద్దరినీ పూజించడం విశేషం. ఈ మాసంలో దీపారాధన చేసి పూజ చేయడం వల్ల సకల పాపాలు హరించి పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. కాలువల్లో దీపాలు వెలిగించటంతో పాటు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇదీ చూడండి:

ఇంద్రకీలాద్రిపై కార్తీకమాస పూజలు.. నేటి నుంచి ప్రారంభం

Last Updated : Nov 5, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.