రాష్ట్రంలో ఇసుక కొరత కొనసాగుతుండటంపై భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 5 నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చి నెలరోజులు దాటినా ఇసుక తగినంత దొరకక పోవటంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రభుత్వాన్ని విమర్శించారు. 4 నెలలుగా ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడి అప్పుల పాలయ్యారని అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రికి లేఖలు రాసినా, గవర్నరును కలిసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. విజయవాడలోని భాజపా నగర కార్యాలయంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. భవన నిర్మాణ కార్మికుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేడు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: