రాజధాని తరలింపు ప్రతిపాదన సరికాదని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టొద్దని కోరారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధికి 6 వేల కోట్లు ఖర్చుపెడితే 53 వేల కోట్ల సంపద వస్తుందని వివరించారు. వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఈ 7నెలల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. అపోహలు సృష్టించి అమరావతిని ఎడారి చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని తరలింపుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్పందించాలని కనకమేడల పిలుపునిచ్చారు. స్పందించకపోతే వారి బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి