జగన్ పాలన రాష్టానికి ముప్పుగా మారిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. 3..విధ్వంసాలు 6.. అరాచకాలుగా ఏడాది పాలన సాగిందని విమర్శించారు. వైకాపా.. ఏపీ ప్రతిష్టను మంటగలిపిందన్నారు. 12 నెలల పాలనలోనే రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టారని దుయ్యబట్టారు.
జగన్కు నాయకునికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని కళా ఆరోపించారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా, నవరత్నాలు పేరుతో నవమోసాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల్లోనూ వైకాపా నేతలు కబ్జాలు, దౌర్జన్యాలు, దందాలు చేస్తున్నారని ఆరోపించారు.
పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేద మహిళల పుస్తెలు తెంపే మద్యం దుకాణాలు తెరిచారని కళా మండిపడ్డారు. కరోనా ప్రభావంలో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కళా వెంకట్రావు ఆక్షేపించారు.
ఇదీ చదవండి : మత్స్యకార భరోసా పథకం ప్రారంభించనున్న సీఎం