ETV Bharat / city

నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం.. ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు

నేటి నుంచి వారం పాటు కాకతీయ సప్తాహ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో కాకతీయ 22వ తరం వారసులైన కమల్​ చంద్ర భంజ్​ దేవ్​ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు మొదలైనవి నిర్వహించనున్నారు.

కాకతీయ వైభవ సప్తాహం
కాకతీయ వైభవ సప్తాహం
author img

By

Published : Jul 7, 2022, 9:06 AM IST

కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఏడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కాకతీయ 22వ తరం వారసులైన కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.

ఇందుకోసం ఆయన చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుంచి వరంగల్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌ చంద్ర భంజ్‌కు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. అటు కాకతీయ కట్టడాల నిర్మాణంలో దాగిన సాంకేతికతపై సదస్సులు, కవి సమ్మేళనాలు, నాటకాలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.