ETV Bharat / city

KA Paul Allegations On Cm Kcr: 'నాకేమైనా అయితే... కేసీఆర్​, కేటీఆర్​దే బాధ్యత'

KA Paul Allegations On Cm Kcr: తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు.

KA Paul
KA Paul
author img

By

Published : May 18, 2022, 10:36 PM IST

KA Paul Allegations On Cm Kcr: తనకు ప్రాణహాని ఉందని... తనకు ఏమైనా హాని జరిగితే దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... మంత్రి కేటీఆర్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి వ్యతిరేకమైన ప్రభుత్వమని దుయ్యబట్టారు. హైదరాబాద్ బేగంపేట ప్రకాశ్​నగర్‌లోని చికోటీ గార్డెన్స్‌లో లీడర్లు, పాస్టర్లు, బిషప్‌లో సమావేశాన్ని అడ్డుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో అనుమతులు ఇస్తున్నారని... కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. పేద క్రైస్తవులకు, పాస్టర్లకు నా వంతుగా సహాయం చేయడం తప్పా అని నిలదీశారు. రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని... వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు.

పాస్టర్ల సమావేశాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌ కోటి రూపాయలు ఇచ్చారని కేఏ పాల్ ఆరోపించారు. తనతో గొడవ పడిన వారెవరు ఇంతవరకు బతికి బట్టకట్టలేదని... దేవుడు ఆ విషయంలో వారిని వదిలి పెట్టడని శాపనార్థాలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో ఓటర్​కి లక్ష రూపాయలు, పాస్టర్​కి పది లక్షలు, బిషప్​కి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్‌ ఇచ్చే డబ్బులు తీసుకొని తనకు ఓటు వేయాలని కోరారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.