తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు( Junior doctors) సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. డిమాండ్లన్నీ నెరవేర్చకున్నా సీఎం హామీతో విరమిస్తున్నట్లు చెప్పారు.పెంచిన స్టైఫండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.
మరోవైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్ వైద్యులు( Junior doctors) సమ్మెకు పిలుపునివ్వడం, విధులను బహిష్కరించడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం ఏనాడూ జూడాలపై వివక్ష చూపలేదని.. వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం నిర్ణయించారు. మూడేళ్ల వైద్యవిద్య అభ్యసించి కరోనా సేవలందిస్తున్న వైద్య విద్యార్థులకూ సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనం అందించాలని ఆదేశించారు.
ఇదీచదవండి.