ETV Bharat / city

Jagan Bail cancel petition: జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యంపై తీర్పు వాయిదా - cm jagan case issue latest news

Judgment on Jagan's bail
Judgment on Jagan's bail
author img

By

Published : Aug 25, 2021, 1:49 PM IST

Updated : Aug 25, 2021, 2:17 PM IST

13:48 August 25

సెప్టెంబర్‌ 15న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్​పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన హైదరాబాద్​లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. అన్నివైపుల వాదనలు పూర్తికావడంతో జులై 30న విచారణ ముగించింది. ఆ రోజున తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

ఈ తీర్పు ఎలా ఉంటుందోనని అప్పటినుంచి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దునూ కోరుతూ రఘురామరాజు వేసిన పిటిషన్​పై ఇవాళే వాదనలు ముగియడంతో.. జగన్​తో పాటు విజయసాయిరెడ్డి పిటిషన్​పైనా సెప్టెంబర్ 15వ తేదీన ఒకేసారి తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది.

ఇదీ చదవండి: ACCIDENT: ప్రకాశం జిల్లాలో ప్రమాదం..ఆటో నుంచి పడి నలుగురు మృతి

Last Updated : Aug 25, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.