ETV Bharat / city

కేసులు బనాయించినా జైలుకు వెళ్లేందుకు సిద్ధమే: జేసీ ప్రభాకర్ రెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తలు

తనపై ఎన్ని కేసులు బనాయించినా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అధికారం చేతుల్లో ఉందన్న కారణంతో వైకాపా నేతలు... తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

jc prabhakar reddy
jc prabhakar reddy
author img

By

Published : Oct 21, 2020, 5:03 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారం ఉందని... కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన...రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని... లా అండ్ ఆర్డర్ సరిగా లేదని విమర్శించారు.

తన పేరుపై వాహనాలు లేకున్నా ఉన్నట్లు చూపి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఉంటుందని... అందుకే వాహనాలను అక్కడ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కొత్త వాహనాలకు ఎలాంటి పరిమితులు ఉన్నాయో తమ వాహనాలకు కూడా అలాంటిదే ఉన్నాయని.. అయితే ఇక్కడ ఉన్న నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనపై కేసులు బనాయిస్తున్నారని అన్నారు.

ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు చేసుకోవాలని అధికార పార్టీ నేతలను హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.