JANASENA SUPPORT : అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్న రైతులకు.. జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాస్.. ఎర్రబాలెం వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు. రాజధాని కోసం రైతులు చేసే ఉద్యమానికి జనసేన పూర్తిగా అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. పాదయాత్ర అరసవల్లి చేరుకునేంత వరకు నియోజకవర్గాల వారీగా తమ పార్టీ నేతలు రైతులతో కలిసి నడుస్తారని వెల్లడించారు.
ఇవీ చదవండి: