ఎంపీ రఘురామ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని జనసేన ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై లోక్‌సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు.
ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని నాదెండ్ల మండిపడ్డారు. విచారణ పేరుతో ఎంపీతో అనుచితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
ఎంపీ రఘురామకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు.. నివేదిక కోసం కోర్టు నిరీక్షణ