ETV Bharat / city

అమరావతిపై భరోసాతోనే.. కమలంతో పొత్తు: పవన్​

రాజధాని అమరావతికి జనసేన, బీజేపీ కట్టుబడి ఉన్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మద్దతు లేదని చెప్పారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన జనసేనాని వారి పోరాటానికి మరోసారి సంఘీభావం తెలిపారు. అమరావతిని ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదల్చలేరని... రైతులు, మహిళల పోరాటానికి అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు.

janasena founder pankalyan at mandadam
మందడంలో పవన్ కల్యాణ్
author img

By

Published : Feb 15, 2020, 7:48 PM IST

Updated : Feb 16, 2020, 8:06 AM IST

వైకాపావి అబద్ధాలన్న జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​

అమరావతి ఉద్యమం 60వ రోజుకు చేరుకున్న వేళ... జనసేనాని పవన్ కల్యాణ్ రెండోసారి రాజధాని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రబాలెం నుంచి ప్రారంభమైన పర్యటన... కృష్ణాయపాలెం, రాయపూడి, అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిర్విరామంగా కొనసాగింది. వేలాది మంది రైతులు పవన్ సభకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్​ రాజధానిపై మాట మార్చారని విమర్శించారు. అధికార వికేంద్రీకరణ అంటూ జగన్ అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆయనేమైనా ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపా అంటూ ఎద్దేవా చేశారు.

ఐదు కోట్ల ఆంధ్రుల కోసం..

రాజధాని రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చింది తమ బిడ్డల భవిష్యత్తు కోసం కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల కోసమని పవన్​ కల్యాణ్​ వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపు అంశాన్ని రియల్ ఎస్టేట్ క్రీడలా మార్చారని.... వివాదానికి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాను ఓట్ల కోసం రాలేదని, ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియదని చెప్పారు. అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కేంద్ర సమ్మతి లేదు

మూడు రాజధానుల అంశం సమ్మతం కాదంటూ కేంద్ర పెద్దలు తనకు స్పష్టత ఇచ్చినట్లు పవన్ వెల్లడించారు. పొత్తు పెట్టుకునేటప్పుడు ఎన్ని సీట్లంటూ అడగలేదని... అమరావతిపై మాత్రం వారి స్పష్టత కోరినట్లు చెప్పారు. అమరావతికే కట్టుబడి ఉన్నట్లు కేంద్ర పెద్దలు చెప్పారని... పార్టీపరంగా పొత్తులో భాగంగా దీనిపై ఒప్పందాన్ని రాసుకున్నామని పవన్ తెలిపారు. అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేశాక.. ఇప్పుడు వైకాపా మూడు రాజధానులని చెబితే ఎలా అని ప్రశ్నించారు.

వారు పొత్తు పెట్టుకుంటే మేము కటీఫ్​..

వైకాపా నేతలు పొత్తులపై చెబుతున్నవన్నీ అబద్ధాలేనని పవన్​ కల్యాణ్​ స్పష్టం చేశారు. భాజపా, వైకాపా పొత్తు పెట్టుకుంటే అందులో తానుండబోనని స్పష్టం చేశారు. అలాంటి పని భాజపా చేస్తుందని తాను భావించడం లేదన్నారు. కర్నూలులో హైకోర్టుకు భాజపా హామీ ఇచ్చిందని... తను సైతం కర్నూలులో ఉన్నత న్యాయస్థానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు.

భాజపాతో కలిసి లాంగ్​మార్చ్​

రాజధాని రైతులకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ దిల్లీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందని... త్వరలో భాజపాతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని గుర్తు చేసిన పవన్ రాజకీయ క్రీడలో పోలీసులు భాగం కారాదని హితవు పలికారు.

ఇవీ చదవండి:

రాజధాని రైతులకు అండగా నేనుంటా: పవన్

Last Updated : Feb 16, 2020, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.