జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50.91 లక్షల మంది తల్లులకు జనవరి 9న రూ.15 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒక కుటుంబంలో ఒకటి నుంచి ఇంటర్ వరకూ చదివే పిల్లలు ఎందరున్నా.. ఒక్కరికే ఈ పథకం వర్తించనుంది. తల్లి ఆధారంగా చెల్లింపులు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 70.41 లక్షలు ఉండగా.. తల్లుల సంఖ్య 42.37 లక్షలుగా గుర్తించారు.
గుర్తింపు ఇలా..
విద్యార్థులు, తల్లుల బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుల వివరాలను ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేశారు. రేషన్ కార్డున్న వారి వివరాలను ఒక నివేదిక, రేషన్ కార్డు లేని వారు, కార్డు ఉండి ప్రభుత్వ ఆదాయం ఎక్కువ ఉన్న వారి వివరాలతో మరో జాబితాను రూపొందించారు. రేషన్ కార్డులు లేని ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువగా ఉన్న వారు సుమారు 8 లక్షల మందిగా లెక్క తేలింది. వీరి వివరాలను గ్రామ వాలంటీర్లతో పరిశీలన చేయించారు. ఇందులో నుంచి సుమారు 65 వేల మంది లబ్ధిదారులుగా తేలారు. గ్రామ సభల ఆమోదంతో జాబితాలను పాఠశాల విద్యా శాఖకు పంపించగా వారు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ వద్దనున్న రేషన్, ఆధార్ కార్డులతో లింకు చేసి లబ్ధిదారుల సంఖ్యను గుర్తించారు.
ఇదీ చూడండి: