భృతికి అర్హతలు..
- దరఖాస్తుదారు లా డిగ్రీ పొంది ఉండాలి.
- దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
- కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్‌లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
- జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి... తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు.
- 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి... ధ్రువీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి 6 నెలలకు జూనియర్ అడ్వొకేట్స్ అఫిడవిట్‌ను సమర్పించాలి.
- న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా... ఆ వివరాలను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
- బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరునమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్‌లో ఉంచాలి.
- కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింపజేస్తారు.
- ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
- జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు
- జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు
- నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు
- అర్హులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధ్రువపత్రం అప్‌లోడ్ చేయాలి.
- సీనియర్ న్యాయవాది ధ్రువీకరణతో బార్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి.
- దరఖాస్తుదారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి.
ఇదీ చదవండి: ఎవరైనా ఇబ్బంది పెడితే.. కాల్ చేయండి!