తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లలో ఎక్కువ మంది అచ్చెన్ననే పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న అభిప్రాయాన్ని అధినేత వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను తెదేపా ఇప్పటికే మండలస్థాయి వరకు దాదాపుగా పూర్తిచేసింది. ఇకపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనున్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తిచేశారు. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తిచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'ప్రజల కోసం పోరాడుతున్నారనే కేసులు పెట్టారు'