26 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా మాతృభూమికి సేవలు అందించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ (IPS Officer Praveen Kumar) తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా (Voluntary Retirement) చేశారు. ఇంకా ఆరు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ... వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ (TWITTER) ద్వారా తెలిపారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శికి ఈ మెయిల్ చేసినట్లు వెల్లడించారు. పదవిలో ఉన్నంత కాలం తనకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకిత భావంతో పని చేశానని చెప్పిన ప్రవీణ్‌కుమార్.. సంక్షేమ భవనంలో 9 సంవత్సరాల కాలం 9 నిమిషాలుగా గడిచిపోయిందన్నారు.
పోలీసు అధికారిగా సేవలు అందించి... ప్రవీణ్‌కుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించి, సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భావించి ఆయన్ను ప్రోత్సహించడంతో.. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమూల మార్పులు చేశారు.
సర్వీస్‌లో ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేసేలా ప్రోత్సాహించిన... అప్పటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి... ఇప్పటి తెరాస ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం తన శేషజీవితాన్ని మహనీయులు మహాత్మజ్యోతిరావు పూలే దంపతులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనిస్తానని స్పష్టం చేశారు. పేదలకు అండగా ఉండి... భావి తరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే దిశగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: