ETV Bharat / city

మినీ ట్రక్కుల దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు

పౌరసరఫరాల సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రేషన్​ షాపుల నుంచి వస్తువులను రవాణా చేసేందుకు మినీ ట్రక్కులను వినియోగించనున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అర్హులైన అభ్యర్థులకు రాయితీతో వాహనాలను అందించనున్నారు. ఇందులో భాగంగా ఎంపికకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

interviews for giving trucks to supply civil supplies things
మినీ ట్రక్కుల దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూల నిర్వహణ
author img

By

Published : Dec 4, 2020, 7:14 PM IST

ఇంటింటికీ రేషన్​ సరుకుల రవాణాకు ప్రభుత్వం మినీ ట్రక్కులను అందించనుంది. రూ.5,81,100 విలువ చేసే వాహనాలను లబ్ధిదారులకు అందిస్తారు. వీటిపై 60% ప్రభుత్వం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం, పది శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.

విశాఖ జిల్లాలో..
నర్సీపట్నం పరిధిలోని 85 రేషన్​ దుకాణాలకు సంబంధించి ట్రక్కులను అందజేసేందుకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రక్రియ ముగిసిన అనంతరం తుది జాబితా వెల్లడిస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.

కృష్ణాజిల్లాలో..
నందిగామ మండల పరిషత్​ కార్యాలయంలో ఎస్సీ నిరుద్యోగులను అధికారులు ఇంటర్వ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా, నగర పంచాయతీ, బ్యాంకుల ప్రతినిధులు కమిటీ అధికారులు పాల్గొన్నారు. మినీ ట్రక్కుల కోసం ఎస్సీలు భారీగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జగ్గయ్యపేట పరిధిలో రేషన్​ సరఫరా కోసం అందించే మినీ ట్రక్కులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీవో, బ్యాంకు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..
పాతపట్నం మండల కేంద్రంలో మినీ ట్రక్కులకు మౌఖిక పరీక్షలను ప్రారంభించారు. 18 సచివాలయాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్టు ఎంపీడీవో చెప్పారు. కార్పొరేషన్ అధికారులు, బ్యాంకర్లు, మండల పరిషత్ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు జరిగాయి.

ఇదీ చదవండి: పింఛన్ల పంపిణీలో సీఎం జగన్​వి పచ్చి అబద్ధాలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.