High Court On Electricity Dues Dispute Between Two States: ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీకి రూ.7వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వాదన వినకుండా కేంద్రం ఉత్తర్వులివ్వడం సమంజసం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.
అసలేెం జరిగిదంటే: ఏపీకి, తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం బకాయిపడ్డ రూ.3,441 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ ను, రూ.3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీ చెల్లించాలని పేర్కొంది. ఆ బకాయిలను తెలంగాణ రాష్ట్రం 30రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. 2014-17 వరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సంబంధించిన విద్యుత్ సరఫరా బకాయిలుగా కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి: