ETV Bharat / city

సిలబస్​ను విడుదల చేసిన ఇంటర్మీడియట్​ బోర్డు

ఇంటర్ సిలబస్​ను 30 శాతం కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (ఆర్ట్స్ & సైన్స్) సిలబస్​ను విడుదల చేసింది.. తగ్గించిన సిలబస్ వివరాలను బోర్డు వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచింది.

inter syllabus
inter syllabus
author img

By

Published : Aug 16, 2020, 11:03 PM IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా మార్చి నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. వాటిని ఆగస్ట్ 31వ తేదీ వరకూ మూసివేయాలని ఈ మధ్య విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం కావటం ఆలస్యం అవుతుండటంతో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 9 నుంచి 12వ తరగతుల సిలబస్​ని 30 శాతం తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇప్పటికే ప్రకటించింది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ని 30 శాతం కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (ఆర్ట్స్ & సైన్స్) సిలబస్​ను విడుదల చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

పూర్తి వివరాలను ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్​లో చూడవచ్చు. https://bie.ap.gov.in/ సాధారణంగా 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. సెప్టెంబరు 5 నుంచి కళాశాలలను ప్రారంభిస్తే 175 వరకు పనిదినాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్​లైన్ పాఠాలను ప్రారంభించారు .

ఇదీ చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.