ETV Bharat / city

'ఫలితాలు చూసుకోకుండానే.. అనంత లోకాలకు వెళ్లిపోయింది' - రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

దైవదర్శనానికి వెళ్లి 12 మంది మృత్యువాత పడిన ఘటనలో ఓ ఇంటర్ విద్యార్థి సైతం ప్రాణాలు వదిలింది. ఇటీవల విడుదలైన ఫలితాలల్లో ఉత్తీర్ణత సాధించిన ఆ అమ్మాయి... ఈ విషయం తెలుసుకోకుండానే ప్రాణాలు వదిలేసిందనే బాధ.. ఆ కుటంబసభ్యులకు మరింత కలిచివేసింది.

inter-student-died
inter-student-died
author img

By

Published : Jun 19, 2020, 4:58 PM IST

'ఫలితాలు చూసుకోకుండానే.. అనంత లోకాలకు వెళ్లిపోయింది'

తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరానికి చెందిన కల్యాణి... చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి వేమిరెడ్డి గోపిరెడ్డి సంరక్షణలో పెరిగింది. ఎర్రుపాలెంలోని జూనియర్​ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి.. పరీక్షలు రాసింది. పరీక్షల్లో పాస్​ అవుతానని... తన వారితో సంతోషంగా చెప్పిన కళ్యాణి... మార్కులు చూసుకోకుండానే మృత్యువాత పడింది.

కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జిల్లా వేదాద్రి దైవదర్శానికి వెళ్తుండగా వీరి ట్రాక్టర్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో కల్యాణితో పాటు మరో 11 మంది మృతి చెందారు. తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాలు వారికి మరింత వేదనను కలిగించాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన కల్యాణి మొదటి సంవత్సర ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. కనీసం ఈ విషయం తెలుసుకోకుండానే తమ బిడ్డను మృత్యువు కబళించిందని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.