తెలంగాణ-ఏపీల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసుల ఆర్టీసీ చర్చలు మరోరెండ్రోజుల్లో కొలికివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు రాష్ట్రాల మధ్య బస్సులు రయ్ రయ్‌మని తిరిగే అవకాశాలున్నాయి. 1 లక్షా 60 వేల కిలో మీటర్లకు రూట్ మ్యాప్‌ను తయారుచేసి తెలంగాణ అధికారులకు ఏపీ అధికారులు పంపించారు. మొదట 2 లక్షల 60 వేల కిలోమీటర్లు తిప్పుతామని అధికారులు ప్రతిపాదనలు చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు.
టీఎస్ఆర్టీసీ ఏపీలో 1 లక్షా 60 వేల కిలో మీటర్లు తిప్పినప్పుడు.. ఏపీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణాలో కూడా లక్షా అరవైవేల కిలోమీటర్లు మాత్రమే తిప్పాలని స్పష్టం చేసింది. ఎట్టకేలకు 1 లక్షా 60 వేల కిలోమీటర్లు తిప్పేందుకు అంగీకరించిన ఏపీఎస్ ఆర్టీసీ మరో రూట్‌మ్యాప్‌ను రూపొందించి తెలంగాణకు అందించింది.
హైదరాబాద్-విజయవాడ రూట్‌పై స్పష్టత వస్తే.. రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల మధ్య చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఇరు రాష్ట్రాల అధికారులు దృశ్య మాధ్యమాల ద్వారా ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే.. ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి