ETV Bharat / city

ఇకపై ఇంటర్​ ప్రవేశాలు ఆన్​లైన్​లోనే!

author img

By

Published : Mar 5, 2020, 7:40 AM IST

2020-21 విద్యా సంవత్సరం నుంచి మార్కుల ఆధారంగా ఇంటర్​ ప్రవేశాలను ఇంజనీరింగ్​ తరహాలోనే ఆన్​లైన్​ చేయనున్నారు. అంటే ప్రతిభ ఆధారంగానే ఈ ప్రవేశాలను నిర్వహిస్తారు. ఈ నూతన విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటర్​ విద్యామండలి నిర్ణయించింది.

inter admissions will be online from next year
ఇంటర్​ ప్రవేశాలు ఆన్​లైన్​లోనే

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌తో సహా అన్ని జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌లోనే ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజినీరింగ్‌కు నిర్వహిస్తున్న విధానంలోనే ఈ ప్రక్రియ ఉంటుంది. పాఠశాల విద్యనియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించే రుసుములను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. ఈ రుసుముల ఆధారంగా విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రతిభ ఆధారంగానే ఈ ప్రవేశాలు ఉంటాయి. కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది. పరీక్షలు ముగిసిన వెంటనే ఆన్‌లైన్‌ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రవేశాలు ఇలా..

  • విద్యార్థుల పదో తరగతి వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి తీసుకుని, ఆన్‌లైన్‌తో లింకు చేస్తారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరు నమోదు చేయగానే పూర్తి వివరాలు కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
  • గ్రామ, వార్డు సచివాలయాల నుంచే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. సచివాలయంలో విద్య సంక్షేమ అధికారి విద్యార్థులకు సహకారం అందిస్తారు.
  • మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఏదైనా కళాశాలలో సీట్లు తక్కువగా ఉండి, దరఖాస్తులు అధికంగా వస్తే మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఒక్కో విద్యార్థి ఐదారు కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు.
  • ఇంటర్‌ విద్యామండలికి చెల్లించాల్సిన పరీక్ష రుసుమును దరఖాస్తు సమయంలోనే వసూలు చేస్తారు. కొన్ని కళాశాలలు పరీక్ష రుసుము పేరుతో అధిక వసూళ్లు చేయడం, పిల్లల నుంచి తీసుకున్న రుసుములను బోర్డుకు చెల్లించని ఘటనలు వెలుగుచూస్తుండటంతో పరీక్ష రుసుమును విద్యార్థుల నుంచి నేరుగా తీసుకోవాలనే నిబంధన తీసుకొస్తున్నారు.
  • ప్రతి కళాశాలలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయిస్తారు.
  • దరఖాస్తు సమయంలోనే ఆయా కళాశాలల రుసుములు కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • ఆన్‌లైన్‌ ప్రవేశాలను రెండు మూడు విడతలుగా నిర్వహిస్తారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.