ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటియం), నెల్లూరు, పర్యటక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ..ఈ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభించింది. అడ్మిషన్ కమిటీ కన్వీనర్ సంజీవ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. పర్యటక రంగాన్ని జీవనోపాధిగా మలుచుకోవాలనుకునే ఔత్సాహికులు... భారత పర్యటక మంత్రిత్వ శాఖ స్థాపించిన ఈ విద్యా సంస్థలు గ్వాలియర్ , భవనేశ్వర్, నోయిడా, నెల్లూరులలో ఉన్నాయని తెలిపారు.
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ ప్రవేశాలకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అడ్మిషన్ల కోసం, మరిన్ని వివరాలకు తమ అధికారిక వెబ్ సైట్ www.iittmsouth.org ను సందర్శించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం