Pneumatic door in APSRTC bus: ప్రమాదాల నివారణ కోసం అర్టీసీ సంస్థ అనేక చర్యలు చేపడుతోంది. నిత్యం ఉండే రద్ధిని దృష్టిలో ఉంచుకోని తగిన చర్యలకు పూనుకుంది. అందుకోసం ప్రమాదాలకు కారణమయ్యే వివిధ అంశాలపై అధ్యాయనం చేసి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్రైవేట్ బస్సుల్లో మాత్రమే కనబడే న్యూమాటిక్ డోర్లను ఏర్పాట్లు చేసేందుకు ప్రయోగాత్మకంగా రెండు పల్లె వెలుగు బస్సులను ఎంచుకుంది.
కదులుతున్నబస్సుల్లో ప్రయాణికులు ఎక్కుతూ దిగుతూ జారిపడుతోన్న ఘటనలు జరుగుతోన్న దృష్ట్యా ప్రమాదాల నివారణపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. అన్ని బస్సులకూ ఆటోమేటిక్గా పనిచేసే న్యుమాటిక్ డోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు పల్లెవెలుగు బస్సులకు న్యుమాటిక్ డోర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ హౌస్ వద్ద సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు డోర్ల పనితీరును పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసమే సరికొత్త డోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.
డోరును తెరవడం మూయడం డ్రైవర్ చేతిలో ఉంటుంది కాబట్టి కదులుతున్న బస్సుల్లో ఎక్కడం, దిగడం వల్ల జరిగే. ప్రమాదాలకు ఆస్కారం ఉండదని ఎండీ తెలిపారు. కొద్దిరోజుల పాటు ప్రయోగాత్మకంగా నడిపి సిబ్బందితో పాటుగా, ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుని లోపాలుంటే సవరించి అధ్యయనం చేసి సంస్థలో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ సహా అవసరమైన అన్ని బస్సులకు ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ తెలిపారు.
ఇవీ చదంవడి: