ETV Bharat / city

Pensions: పింఛన్ పథకంలో 6వేల మంది అనర్హుల గుర్తింపు..మరో లక్ష మందికి నోటీసులు - ఏపీలో ఒంటరి మహిళల పింఛన్ల తనిఖీని

రాష్ట్రవ్యాప్తంగా వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల తనిఖీని ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల బియ్యం, ఆధార్‌ కార్డులను పరిశీలించగా.. సుమారు లక్ష మందికిపైగా వివరాల్లో మార్పులున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలన జరుపుతున్నారు. ఇప్పటికే 6వేల మందిని అనర్హులుగా తేల్చారు. వీరికి జులై 1న ఇవ్వబోయే పింఛనును నిలిపేయనున్నారు.

pensions
pensions
author img

By

Published : Jun 28, 2021, 7:33 AM IST

Updated : Jun 28, 2021, 12:30 PM IST

తనిఖీ పూర్తయిన వారికే పింఛను

నోటీసులు అందుకున్న లక్ష మందికిపైగా లబ్ధిదారుల్లో సరైన ధ్రువపత్రాలను అందించిన వారికే జులై 1న పింఛను అందిస్తారు. కర్నూలు జిల్లాలో 11వేల మందికి, కృష్ణాలో 14వేల మందికి, విజయనగరంలో 8వేల మందికి, చిత్తూరు జిల్లాలో 16వేల మందికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 80వేల మందికిపై లబ్ధిదారుల వివరాల పరిశీలన పూర్తయింది. వీరిలో 6వేల మంది వరకు అనర్హులున్నట్లు పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) అధికారులు గుర్తించారు. తనిఖీలో ఎక్కువగా ఒంటరి మహిళ కాకున్నా ఆ కేటగిరీలో పింఛన్లు పొందుతున్నారని గుర్తించారు. ఈ నెల 30 వరకు తనిఖీ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటికీ పరిశీలన పూర్తికాని వారి పింఛన్లను ఆపుతారు. తనిఖీలను కొనసాగిస్తారు. జులై 15లోగా సరైన వివరాలు అందించిన వారికి పింఛను ఇస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాలు అందిస్తే రెండు నెలలదీ ఒకేసారి ఆగస్టు 1న అందిస్తారు.

వితంతు పింఛను పొందుతున్నా..

బియ్యం కార్డులో భర్త పేరు ఉండటం, భర్త పేరు స్థానంలో కుమారుడి పేరు నమోదై ఉండటం, ఈకేవైసీలో లింగం తప్పుగా నమోదై ఉండటం, ఒంటరి మహిళలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు అందించకపోవడం, ఇంకొన్ని చోట్ల పింఛను పొందుతున్నది మహిళలైతే పురుషులుగా నమోదై ఉండటం, ఆధార్‌ కార్డుల్లో మార్పులు, తదితర కారణాలతో లబ్ధిదారులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సరైన ధ్రువపత్రాలు అందించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం

Last Updated : Jun 28, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.