రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అన్నారు. రాజధానిలో జరిగిన భూఆక్రమణలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. తగిన సమయంలో ఆ చిట్టా బహిర్గతపరుస్తామన్నారు.
కేంద్ర మాజీ మంత్రి తనకు రాజధానిలో భూములే లేవంటున్నారు... ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన సవాల్ విసిరితే మెుత్తం బయటపెడతామన్నారు బొత్స. పవన్ గతంలో ఏం చెప్పారో..ఇప్పుడేం మాట్లాడుతున్నారో రికార్డులు పరిశీలించాలన్నారు. అమరావతిపై గతంలో భాజపా ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందిది కాదని.. అక్కడి రైతులు కౌలు అందలేదని మాత్రమే ఆందోళన చేస్తున్నారన్నారు. ఆ అశంపై ముఖ్యమంత్రితో చర్చించామని.. వారి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు బొత్స.
ఇదీచదవండి పోలవరం కేంద్రానికి ఇచ్చే ఆలోచన లేదు... మేమే పూర్తి చేస్తాం...