ETV Bharat / city

new districts : జనాభాలో నెల్లూరు.. విస్తీర్ణంలో ప్రకాశం జిల్లాలదే అగ్రస్థానం - రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా

new districts : రాష్ట్రంలో కొత్త జిల్లాల లెక్క తేలింది. అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు తొలి స్థానంలో, ప్రకాశం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. విస్తీర్ణం, మండలాల పరంగా చూస్తే రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం నిలిచింది.

new districts
new districts
author img

By

Published : Apr 4, 2022, 5:02 AM IST

Updated : Apr 4, 2022, 5:47 AM IST

జనాభాలో నెల్లూరు.. విస్తీర్ణంలో ప్రకాశం జిల్లాలదే అగ్రస్థానం

new districts : కొత్త జిల్లాల లెక్క తేలింది. 72 రెవెన్యూ డివిజన్లతో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు తొలి స్థానంలో, ప్రకాశం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. రెండు జిల్లాల్లోనూ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఉన్నాయి.

...

23% జనాభా 5 జిల్లాల్లోనే: నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు జనాభా పరంగా ముందున్నాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో (2011 లెక్కలు) ఈ 5 జిల్లాల వాటాయే 23%పైగా ఉండటం గమనార్హం.

* విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ప్రకాశం నిలిచింది. 14,322 చ.కి.మీ.విస్తీర్ణంలో ఇది ఉంది. తర్వాత స్థానంలో అల్లూరి సీతారామరాజు 12,251 చ.కి.మీ., కడప జిల్లా 11,228 చ.కి.మీ.చొప్పున ఉన్నాయి. రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలే 23.19 శాతం ఆక్రమించాయి.

* విస్తీర్ణం, మండలాల పరంగా చూస్తే రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. 11 మండలాలతో ఉన్న జిల్లా విస్తీర్ణం 1,048 చ.కి.మీ.మాత్రమే. తర్వాతి స్థానంలో కోనసీమ జిల్లా 2,083, పశ్చిమగోదావరి 2,178, గుంటూరు 2,443, తూర్పుగోదావరి 2,561, కాకినాడ 3,019 చ.కి.మీ. ఉన్నాయి. ఈ 6 జిల్లాల మొత్తం విస్తీర్ణం కలిపినా ప్రకాశం జిల్లా కంటే తక్కువే.

* ఎస్‌పీఎస్‌ నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని మొత్తం మండలాల సంఖ్య 240.. అంటే రాష్ట్రంలోని మొత్తం మండలాల్లో 35.35% మండలాలు ఈ 7 జిల్లాల్లోనే ఉన్నాయి.

..
...
...
..
...
...

ఇదీ చదవండి: new districts : నేటి నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు

Last Updated : Apr 4, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.