ETV Bharat / city

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. వాటిల్లో రైల్వే మంత్రి, రైల్వేబోర్డు ఛైర్మన్‌ - telangana news

train collision protection system 'Kavach': దక్షిణమధ్య రైల్వే జోన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌లోని లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌లో శుక్రవారం ఒకే రైల్వే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రాబోతున్నాయి. ఒక రైల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉంటారు. మరో దాంట్లో రైల్వేబోర్డు ఛైర్మన్‌, సీఈవో వినయ్‌కుమార్‌ త్రిపాఠి ఉంటారు. ఎందుకో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే..

train collision protection system 'Kavach'
ఒకే ట్రాక్‌పై.. ఎదురెదురుగా రైళ్లు.. వాటిల్లో రైల్వే మంత్రి, రైల్వేబోర్డు ఛైర్మన్‌
author img

By

Published : Mar 4, 2022, 11:44 AM IST

train collision protection system 'Kavach': దక్షిణమధ్య రైల్వే జోన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌లోని లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌లో శుక్రవారం ఒకే రైల్వే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రాబోతున్నాయి. ఒక రైల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉంటారు. మరో దాంట్లో రైల్వేబోర్డు ఛైర్మన్‌, సీఈవో వినయ్‌కుమార్‌ త్రిపాఠి ఉంటారు. అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయి. రైళ్లకు ఆటోమెటిక్‌ బ్రేకులు పడి ఇలా పూర్తిగా ఆగిపోయినప్పుడు రెండింటి మధ్య సుమారు 200 మీటర్ల దూరం ఉండనున్నట్లు సమాచారం. దక్షిణమధ్య రైల్వేలో ఓ అధికారి ‘ఈనాడు’కి ఈ విషయం తెలిపారు. ఎదురెదురుగా ఈ రైళ్లు సమీపానికి రాకముందే ఆపేందుకు మానవ ప్రయత్నం ఏమీ జరగదు. స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ ఆ రైళ్లను గుర్తించి ప్రమాదం జరగకుండా నివారిస్తుంది. ఇంతక్రితం సాంకేతిక సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఈ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు.

ఏమిటీ కవచ్‌...

రెడ్‌ (డేంజర్‌) సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకొపైలట్‌ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ కవచ్‌ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు గుర్తించి ఇది ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది. దక్షిణమధ్య రైల్వే జీఎం సంజీవ్‌కిశోర్‌ గురువారం సనత్‌నగర్‌ నుంచి బయల్దేరి లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.