ETV Bharat / city

హైదరాబాద్​లో టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ సందడి.. హోటళ్లకు చేరుకున్న ఆటగాళ్లు

ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్న భారత్‌-ఆసీస్‌ కీలక టీ-20 మ్యాచ్‌ కోసం.. ఆటగాళ్లు హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు నేరుగా హోటల్‌ పార్క్‌ హయత్‌లో వెళ్లగా.. హోటల్ తాజ్‌కృష్ణలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బస ఏర్పాటు చేశారు.

match
match
author img

By

Published : Sep 24, 2022, 10:42 PM IST

హైదరాబాద్​లో టీ-20 క్రికెట్ మ్యాచ్ సందడి నెలకొంది. రేపు ఉప్పల్‌ మైదానంలో జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లను చూసేందుకు భారీగా క్రికెట్ అభిమానులు విమానాశ్రయానికి తరలి వచ్చారు. నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు, హోటల్‌ పార్క్‌ హయత్‌లో భారత ఆటగాళ్లకు బస ఏర్పాట్లు చేశారు. రేపటి మ్యాచ్‌ టిక్కెట్ల కోసం మునుపెన్నడూ లేనంత డిమాండ్‌ ఏర్పడింది. రేపు జరిగే మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

రేపు ఉప్పల్‌లో జరగనున్న మ్యాచ్‌తో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం కావడంతో మూడో టీ20 మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం కానుంది. మరోవైపు, తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంతో ఓటమి చవిచూసింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో విజయం సాధించింది. అదే జోరును రోహిత్‌ సేన కొనసాగించాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటుకున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియా ఈ సిరీస్‌ గెలవడం కూడా ఎంతో కీలకమని చెప్పకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.