ETV Bharat / city

ఇమ్యునిటీ షాట్‌ కొట్టేద్దాం. - రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?

ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ముందు జాగ్రత్తలే మనల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి కాపాడతాయి. దీనిలో భాగంగానే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటివే ఈ ‘ఇమ్యునిటీ బూస్టింగ్‌ షాట్స్‌’. వీటిలో అధికంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పుల బారినపడకుండా కాపాడి సహజసిద్ధమైన రక్షణ కల్పిస్తాయి. వీటిని అప్పటికప్పుడు సులువుగా సిద్ధంచేసుకోవచ్ఛు అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయలతోనే వీటిని తయారుచేసుకోవచ్ఛు ఎక్కువ పదార్థాలను వీటిలో కలపాల్సిన పనీ లేదు.

immunity
immunity
author img

By

Published : Apr 29, 2020, 10:00 AM IST

ఇమ్యునిటీని పెంచే వీటిని ఎలా తయారుచేయాలంటే...

  • యాపిల్‌తో..

కావాల్సినవి: యాపిల్‌- ఒకటి, అల్లం- చిన్న ముక్క, నిమ్మకాయ- ఒకటి.

తయారీ: యాపిల్‌, అల్లాన్ని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటన్నింటినీ కలిపి జ్యూస్‌ తీసుకోవాలి. జ్యూస్‌ని వడకట్టిన తర్వాత చివరిగా నిమ్మరసం పిండుకోవాలి.

  • క్యారెట్‌తో..

కావాల్సినవి: క్యారెట్లు- మూడు, నిమ్మకాయ- ఒకటి, అల్లంముక్క- ఒకటి, పసుపు- అర టీస్పూన్‌.

తయారీ: క్యారెట్‌, అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కోసుకుని జ్యూసర్‌లో వేయాలి. వడకట్టగా వచ్చిన రసానికి పసుపు, నిమ్మ రసం కలపాలి.

  • ఆకుకూరలతో..

కావాల్సినవి: పాలకూర- గుప్పెడు, పుదీనా- గుప్పెడు, నిమ్మకాయ- ఒకటి, తేనె - కొద్దిగా.

తయారీ: పాలకూర, పుదీనాను శుభ్రంగా కడగాలి. వీటిని జ్యూసర్‌లో వేసి జ్యూస్‌ చేసుకోవాలి. వడకట్టిన తర్వాత నిమ్మరసం, తేనె వేసి కలుపుకోవాలి.

  • బీట్‌రూట్‌తో..

కావాల్సినవి: బీట్‌రూట్‌- ఒకటి, నిమ్మకాయ- ఒకటి, అల్లంముక్క- ఒకటి.

తయారీ: బీట్‌రూట్‌, అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. వీటిని చిన్న ముక్కలుగా కోయాలి. వీటన్నింటినీ జ్యూసర్‌లో వేసి జ్యూస్‌ తీయాలి. వడకట్టుకున్న తర్వాత నిమ్మరసం, కొద్దిగా తేనె కూడా కలుపుకొని తాగొచ్ఛు.

  • అల్లంతో..

కావాల్సినవి: నిమ్మకాయ- ఒకటి, అల్లం- చిన్న ముక్క, తేనె- టీస్పూన్‌.

తయారీ: అల్లాన్ని పొట్టు తీసి శుభ్రం చేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలల్లో నిమ్మరసం కలుపుకొని జ్యూస్‌ చేసుకోవాలి. వడకట్టగా వచ్చిన రసానికి చివరగా తేనె కలపాలి.

  • దాల్చినచెక్కతో..

కావాల్సినవి: పెద్ద అల్లం ముక్క- ఒకటి, దాల్చినచెక్క పొడి- టీస్పూన్‌, నిమ్మకాయ- ఒకటి

తయారీ: పొట్టు తీసిన అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలకు నిమ్మరసం, దాల్చినచెక్క పొడిని జత చేసి మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. చివరగా పలుచటి వస్త్రంతో వడకట్టుకుంటే సరిపోతుంది.

ఇవీ చదవండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.