విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య సభ్యులు శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా విశాఖలో ఏప్రిల్4న భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.
విజయవాడలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఇఫ్టూ) రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మంత్రులు మీడియాకు పోజులివ్వడం మాని విశాఖ ప్రైవేటీకరణను అడ్డుకునే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. కేంద్రం తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: