రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఐటీ శాఖ కార్యదర్శి కె.సునీతను మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడును సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి నియమించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా బదిలీ చేశారు.
ఆ శాఖ కమిషనర్ రేఖారాణిని కాపు కార్పొరేషన్ ఎండీగా నియమించారు. పురపాలక శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రంజిత్ బాషాను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. ఇక ఎన్వీ రమణరెడ్డిని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాన్షు శుక్లాను ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్.పవన్ మూర్తిని సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: APPSC Schedule for AE Exam: అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగ నియామక పరీక్షలకు షెడ్యూల్ విడుదల