ETV Bharat / city

సినిమా ఏ భాషదైనా లిప్ సింకైపోద్ది.. ఈ టెక్నాలజీతో అట్లుంటది మరి..!

Hyderabad Triple IT Student Research: మూకీ నుంచి మొదలై.. టాకీలో ఎవరెస్టు స్థాయికి చేరిన మన సినిమా.. సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ అద్భుత ప్రగతి నమోదు చేస్తోంది. వీఎఫ్ఎక్స్ వంటి ఎఫెక్ట్స్ తో.. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. అయితే.. అన్ని విభాగాల్లోనూ తారస్థాయిలో ఉన్నప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం ప్రేక్షకులకు ఇబ్బంది తప్పడంలేదు. అదే డబ్బింగ్ సినిమాల వీక్షణ. ఒక భాషలో తెరకెక్కిన చిత్రాలను.. మరో భాషలోకి డబ్ చేసినప్పుడు.. నటీనటుల పెదాలకు, డెలివరీ అయ్యే డైలాగ్స్ కు మధ్య పొంతన కుదరదు. దీనివల్ల ఆడియెన్స్ అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ పరిస్థితిని మార్చేందుకు సరికొత్త పరిశోధన చేశారు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పీహెచ్‌డీ విద్యార్థులు. మరి ఆ టెక్నాలజీ వివరాలేంటో మనమూ చూద్దాం.

wave 2lip
wave 2lip
author img

By

Published : Jun 13, 2022, 7:29 PM IST

wave 2lip

Hyderabad Triple IT Student Research: సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. సినిమా రంగంలో ఈ టెక్నాలజీ రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా ఈ సాంకేతికత.. దశాబ్దాలుగా ఉన్న సమస్యకు చెక్ పెట్టింది. ఓ భాషలో తెరకెక్కిన సినిమాను.. మరో భాషలోకి డబ్ చేస్తే.. పెదాలకు, డైలాగ్ కు సింక్ కుదరక ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యే సంగతి మనకు తెలిసిందే. అయితే.. ఈ పరిస్థిని మార్చేశారు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. ఏకంగా.. 100 భాషల్లో సినిమాను ఆస్వాదించేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశారు.

హైదరాబాద్ ట్రిపుల్‌ ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న రుద్రభా ముఖోపాధ్యాయ, కె.ఆర్ ప్రజ్వల్ ఈ టెక్నాలజీకి తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, మరో ప్రొఫెసర్ వినయ్ సంబూద్రి, సీఈవో పవన్ రెడ్డిలు వీరికి తోడుకావడంతో రెండేళ్లలోనే ఈ టెక్నాలజీ కార్యరూపం దాల్చింది. ఇది పూర్తిగా కృతిమమేధ సహాయంతో పని చేస్తుంది. ఇందుకోసం వందల గంటల వీడియోలను విశ్లేషించి "వేవ్ 2లిప్‌"ను సృష్టించారు.

ఈ టెక్నాలజీ చాలా సింపుల్. ఈ టెక్నాలజీతో కెమెరా, మైక్ లేకుండా.. మనం ఏఐ యూజ్ చేసుకుని.. వీడియోస్‌ ఒక టెక్ట్స్ నుంచి తయారు చేయొచ్చు. మనం న్యూస్ పేపర్‌లో ఉన్న టెక్ట్స్ ను ఒక వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు. టెక్స్ట్ అంతటినీ వీడియోగా మార్చడానికి ఏఐ(కృత్రిమ మేధ) ఉపయోగపడుతోంది. - పవన్ రెడ్డి, వేవ్ 2లిప్ సీఈవో

ట్రిపుల్ ఐటీలోనే రుద్రభా, ప్రజ్వల్‌లు న్యూరల్ సింక్ అనే అంకురసంస్థ స్థాపించారు. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి ప్రాజెక్టు ఈ వేవ్ 2లిప్. వాస్తవానికి ఈ టెక్నాలజీని విద్యార్థుల కోసం తయారుచేశారు. ఇంగ్లీష్‌లో చాలామంది తెలుగు విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఎక్కువ సమాచారం ఆంగ్లంలోనే లభ్యం అవుతుండటంతో చాలామంది చదవలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు సులువుగా వారికి నచ్చిన భాషలోనే నేర్చుకునేలా కృత్రిమ మేధను ఉపయోగించి ఈ వేవ్ 2లిప్‌ను తయారు చేశారు. వేవ్ 2లిప్ టెక్నాలజీని మార్కెట్‌లోకి విడుదల చేయడంతో పలువురు సినీ దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనువాద చిత్రాలకు ఈ టెక్నాలజీ బాగా దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు వేవ్‌ 2 లిప్‌ సంస్థతో ఒప్పందలు చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.

దేశంలో సుమారు 10 భాషల్లో సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఒకభాష నుంచి మరో భాషలోకి డబ్‌ చేసుకోవడం ఈ టెక్నాలజీతో చాలా సులువైన పని. దర్శక, నిర్మాతలకూ సమయం కలిసొస్తుంది. భారత్‌తో పాటు అమెరికా,యూరప్‌లో మార్కెట్లలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచారు. తాజాగా ఈ సంస్థ ప్రతినిధులు వేవ్ 2లిప్ టెక్నాలజీ అమెరికా పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు.

''ప్రపంచంలోనే ఇది తొలి టెక్నాలజీ. ఇదే అంశంపై గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, ప్రపంచంలో ఎవరి వాయిస్‌కైనా, ఏ భాషకైనా లిప్‌ అనుసంధానం చేయవచ్చు. మనుషుల వాయిస్‌లకు బదులు జనరేట్‌డ్‌ వాయిస్‌లు, ఏఐ జనరేటడ్‌ వాయిస్‌లకు ఈ సాఫ్ట్‌వేర్‌ పని చేస్తుంది. విభిన్నమైన వాయిస్‌లు, భాషలకు ఇది ఉపయోగపడుతుంది. 720పిక్సల్‌ నుంచి 4కే వరకు అన్ని రిజల్యూషన్స్‌కు కూడా ఇది పని చేస్తుంది. విభిన్నమైన అంశాలతో కూడిన ఈ సాఫ్ట్‌వేర్‌ చాలా ప్రత్యేకమైనది.'' - రుద్రభా ముఖోపాధ్యాయ, వేవ్ 2లిప్ సీటీవో

హాలీవుడ్ స్థాయిలో ఈ టెక్నాలజీని తీసుకెళ్లాలని రుద్రభా, పవన్ రెడ్డిలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విద్యారంగంలోనే కాక సినీరంగంలోనూ ఈ టెక్నాలజీ ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.