ETV Bharat / city

నటుడు మంచు మనోజ్​కు పోలీసులు ఫైన్ వేశారు..!

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో వరుస ప్రమాదాల అనంతరం నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై దృష్టి పెట్టారు. బ్లాక్ ఫిల్మ్‌ ఉన్న కార్లను నిలిపివేసి అక్కడికక్కడే తొలగిస్తున్నారు. ఇలా హైదరాబాద్ టోలిచౌకీ వద్ద తనిఖీల్లో మంచు మనోజ్‌ కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉందని గుర్తించిన పోలీసులు.. నలుపు తెరను తొలగించారు.

http://10.10.50.85//telangana/30-March-2022/tg-hyd-15-30-challan-to-manchu-manoj-car-av-ts10008_30032022092253_3003f_1648612373_837.jpg
మనోజ్‌ కారు అద్దాల బ్లాక్ ఫిల్మ్‌ తొలగించిన ట్రాఫిక్‌ పోలీసులు
author img

By

Published : Mar 30, 2022, 12:13 PM IST

Black Film Removed From manchu manoj car : నటుడు మంచు మనోజ్‌ కారుకు పోలీసులు 7 వందల రూపాయల చలానా విధించారు. టోలిచౌకీ వద్ద పోలీసుల తనిఖీల్లో మనోజ్‌ కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉందని గుర్తించారు. మంచు మనోజ్‌ కారు అద్దాల బ్లాక్ ఫిల్మ్‌ తొలగించిన ట్రాఫిక్‌ పోలీసులు.. జరిమానా వేశారు. మనోజ్ ఏపీ 39 హెచ్​వై 0319 నెంబర్‌ గల కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల రోడ్డ ప్రమాదాలు అధికంగా జరుగుతుండగా.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

బ్లాక్‌ ఫిల్మ్‌లు ఇతర నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని గుర్తించి వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. సెలెబ్రిటీలు కూడా నిబంధనలు పాటించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, బన్నీ కార్లకు కూడా బ్లాక్​ ఫిల్మ్ తొలగించి.. జరిమానా విధించారు.

ఇవీ చదవండి : Medicines: విజయవాడ రైల్వే ఆసుపత్రి ఔషధాల కొనుగోళ్లలో గోల్‌మాల్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.